ఈ నీచుడు ఎంత పనిచేశాడు.. ?

    0
    1090

    తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువకుడు రెండేళ్ళైనా కాకముందే , భార్యను , తొమ్మిది నెలల బిడ్డను చంపేసి మురికి కాలువలో పాతరేసాడు. భార్యతో పావని (19)పాటు అమృత (9 నెలలు) పసి కందును కడతేర్చిన ఈ నీచుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గురవరాజు పల్లె కు చెందిన పావని తో అదే ఊరికి చెందిన కుమార్ ప్రేమించి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది . ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై మోజు తీరిపోవడంతో వీడు నగిరి కి చెందిన మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు.

     

    మొదటి భార్య పావని ని వదిలించుకోవాలని ప్రయత్నంలో మాయమాటలు చెప్పి ఒంటరిగా తీసుకెళ్లి కూతురితో సహా హత్య చేసి కాలువలో పడేసాడు. పావని తల్లిదండ్రులు తమ కూతురు కనపడలేదని ఆదివారం రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. మురుగు కాలువలో భార్య పావని మృతదేహం కనిపించినా , మురుగునీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతోపసికందు మృతదేహం కనిపించలేదు.. రేణిగుంట డి.ఎస్.పి రామచంద్ర ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు సాగుతొంది.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.