బైక్ ఆపి బెంజ్ కారు తగబెట్టేసాడు..

  0
  290

  బెంజ్ కారుని చూస్తే ఎవ‌రికైనా ఏమ‌నిపిస్తుంది. ఆ కారెక్కి షికారుకి వెళ్ళాల‌నిపిస్తుంది క‌దా.. కానీ ఇక్క‌డ ఓ వ్య‌క్తి ఏకంగా బెంజ్ కారుకి నిప్పంటించేశాడు. ఈ ఘ‌ట‌న నోయిడాలో చోటుచేసుకుంది. స‌ర్దార్ పూర్ విలేజ్ కి చెందిన బిల్డ‌ర్ ఆయుష్ చౌహాన్. అత‌ని వ‌ద్ద ర‌ణ‌వీర్ అనే వ్య‌క్తి ప‌ని చేస్తున్నాడు. జీతం ఇవ్వ‌కుండా ర‌ణ‌వీర్ ను తిప్పించుకుంటున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఆయుష్ చౌహాన్ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో మండిపోయిన ర‌ణ‌వీర్ తాను చేయాల్సింది చేసేశాడు.

   

  ఆయుష్ చౌహాన్ కు బెంజ్ కారు ఉంది. ఆ కారును ఇంటి ముందు పార్క్ చేసి లోప‌లికి వెళ్ళారు. కాసేప‌టికి బైక్ పై వ‌చ్చిన ర‌ణ‌వీర్ వ‌చ్చి, ఆ కారుపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించాడు. దీంతో కోటి రూపాయ‌ల విలువైన కారు బుగ్గిపాలైంది. ఈ ఘ‌ట‌న మొత్తం ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డ‌యింది. ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ర‌ణ‌వీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేశారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.