ఒకే కుటుంబంలో నలుగురు సివిల్స్ టాపర్స్..

    0
    382

    సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి.. క‌ష్టే ఫ‌లి అన్న సామెత‌ను నిజం చేశారు ఒకే కుటుంబంలోని బిడ్డ‌లు. వారిలో ఇద్ద‌రు అక్క‌చెల్లెళ్ళు.. అన్న‌ద‌మ్ముళ్ళు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లాల్ గంజ్ లో అనీల్ ప్ర‌కాష్ మిశ్రా అనే గ్రామీణ‌ బ్యాంకు ఉద్యోగి.. సాదాసీదా జీతంతోనే బిడ్డ‌ల‌ను ప్ర‌భుత్వ స్కూళ్ళ‌లో చ‌దివించాడు. పై చ‌ద‌వులు కూడా ప్ర‌భుత్వ కాలేజీల్లోనే చ‌దివించాడు.

    క‌ష్ట‌ప‌డి చ‌దివిన పిల్ల‌ల్లో పెద్ద కొడుకు యోగేష్ మిశ్రా ఐఏఎస్ కు ఎంపిక‌య్యాడు. త‌ర్వాత అతడి చెల్లెలు క్ష‌మా మిశ్రా ఐపీఎస్ కి ఎంపికైంది. రెండో కూతురు మాధురి మిశ్రా ఐఏఎస్‌కి ఎంపికైంది. సంతానంలో రెండో కొడుకు లోకేష్ మిశ్రా ఐఎఫ్ఎస్ కి ఎంపిక‌య్యాడు.

    ఇలా న‌లుగురు పిల్ల‌లు క‌ష్ట‌ప‌డి చ‌దివి త‌మ ల‌క్ష్యాల‌ను చేరుకున్నార‌ని, ఇంత‌కంటే జీవితంలో త‌మ‌కు ఏం కావాల‌ని .. ప్ర‌యోజ‌కులైన బిడ్డ‌ల‌ను క‌న్న ఆ తండ్రి అనీల్ ప్ర‌కాశ్ మిశ్రా ఆనందం వ్య‌క్తం చేస్తున్నాడు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.