జెల్లిచేపల మధ్య పడవ చిక్కిపోయింది..

  0
  318

  లైఫ్ ఆఫ్ పై” సినిమా చూశారా ? న‌డి స‌ముద్రంలో బోటులో చిక్కుకున్న బాలుడు… రాత్రివేళ జెల్లీ షిప్ లు క‌నువిందు చేసిన దృశ్యం గుర్తుందా ? అలాంటి సీన్ ఒక‌టి ఇజ్రాయెల్ లోనూ క‌నిపించింది. ఇజ్రాయెల్ లోని హైఫా బే ప్రాంతంలో ఈ అంద‌మైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. స‌ముద్రంలో ప్ర‌యాణిస్తున్న బోటు చుట్టూ.. జెల్లీ ఫిష్‌లు సంద‌డి చేశాయి. దూరం నుంచి చూస్తుంటే .. న‌క్ష‌త్రాల‌న్నీ సముద్రంపై ఊడి ప‌డ్డాయా అని అనిపించ‌కమాన‌దు.

  కొన్ని వేల‌సంఖ్య‌లో జెల్లీ ఫిష్‌లు బోటు చుట్టూ చేరిన దృశ్యాన్ని… ఇజ్రాయెల్ కు చెందిన పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ విభాగం డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేసింది. ఈ వీడియోను తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది. ఈ జెల్లీ ఫిష్ లు హిందూ మహా సముద్రం నుంచి ఇజ్రాయెల్ లోని మధ్యధరా సముద్రానికి ప్ర‌తి ఏటా వలస వస్తాయని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.