ఫాస్టాగ్ వల్ల కేంద్రానికి లాభమెంత ..? మనకు ఉపయోగమెంత ..? ఇదీ అసలు రహస్యం..

    0
    375

    ఫాస్టాగ్ వల్ల కేంద్రానికి లాభమెంత ..? మనకు ఉపయోగమెంత ..? ఇదీ అసలు రహస్యం..
    ఫాస్టాగ్ వాళ్ళ రోజుకు కలెక్షన్ ఏంటో తెలుసా..? గతంలో ఫాస్టాగ్ నిర్బంధం లేనప్పుడు రోజుకు 75 కోట్లు వసూలయ్యేది. ఇప్పుడది 92 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ సౌకర్యంతో ఉన్నాయి. రాబోయే ఐదేళ్ళలో ఫాస్టాగ్ కలెక్షన్లు ఏడాదికి లక్ష కోట్లు దాటగలవని అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంవల్ల కేంద్ర ప్రభుత్వానికి 20 వేలకోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేసినట్టు ఉపరితలరవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

    ఫాస్టాగ్ వల్ల టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు వేచిఉండే సమయం తగ్గిందని అన్నారు. దీనివల్ల పెట్రోల్ , డీజిల్ ఆదా అవుతుందని , దానిపై కేంద్రానికి 20 వేల కోట్లు మిగిలిందని అన్నారు. టాక్స్ రూపంలో మరో 10 వేల కోట్లు అదనపు ఆదాయమని అన్నారు. గతంలో జైపూర్ టోల్ వద్ద వాహనాలు టోల్ దాటాలంటే కనీసం 30 నిమిషాలు పట్టేదని ,ఇప్పుడు ఐదు నిమిషాల్లో టోల్ దాటేస్తున్నారన్నారు. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంవల్ల , నేరాలను సులభంగా అరికట్టే అవకాశం ఉందని , వాహనాలు ఎప్పుడు , ఏ టోల్ దాటాయో యజమానులు ఇంట్లో ఉన్నా తెలుసుకోగలరని చెప్పారు…

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?