వాడు హెయిర్ కట్టర్ -అమ్మాయి ఇంజినీర్.. ప్రేమంటూ కత్తితో దాడిచేశాడు.

  0
  569

  తనను ప్రేమించకుండా మరొకరితో పెళ్ళికి సిద్దమైందన్న కోపంతో ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతిపై కత్తితో దాడి చేశాడు . ఆ యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌ శివార్లలోని హైదర్షాకోట్‌లో ఈ దారుణం జరిగింది. ఆ యువతి తల్లితండ్రులతో కలిసి హైదర్షాకోట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు అక్కడకు సమీపంలోని జావెద్‌ హబీబ్‌ సెలూన్‌లో పనిచేస్తున్న షారూఖ్‌తో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది..

  షారూఖ్‌ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. అయితే యువతికి ఈ ఏడా ది మేలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పా ట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న షారూఖ్‌.. తనతోనే ఉండాలంటూ ఆ యువతిపై ఒత్తిడి చేశాడు.

  ఆమె అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో షారూఖ్ , ఆ యువతి ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకొచ్చి , ఆమెకు ఫోన్ చేసి కిందకు రమ్మన్నాడు. ఆమెను పెళ్లి నిరాకరించాలని , తనటోన్ ఉండాలంటూ వత్తిడి చేశాడు. వాదన పెరిగి , కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలకు తల్లితండ్రులు దిగివచ్చి అడ్డుకోబోగా , వారిపైకూడా దాడిచేసి పారిపోయే ప్రయత్నంచేసాడు. స్థానికులు వాడిని తరిమి పట్టుకొని , పోలీసులకు అప్పగించారు..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..