మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని, వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం.. ఎస్ఈసీ ఆదేశాలను నిలిపివేసింది. వాలంటీర్ల విధులపై విధించిన ఆంక్షలను తొలగించింది. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవడాన్ని కూడా సరికాదని తేల్చింది.
పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీ తరపు అభ్యర్థులకు సహకరించారంటూ కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సైతం ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు ఎస్ఈసీ ఆదేశాలను నిలువరించాలంటూ ప్రభుత్వం కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వాలంటీర్ల జోలికి వెళ్లొద్దంటూ ఆదేశాలిచ్చింది.
ఇవీ చదవండి:
అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?
ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..
ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?