శశికళ పుష్పకు పబ్లిక్ గా ఇలా.. ఛీఛీ.

  0
  315

  ఏ రంగంలోనైనా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉందా ? ఆలోచించాల్సిన విష‌య‌మే. సామాన్యురాలి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎంతో మంది మ‌హిళ‌లు, ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు. కానీ ఎక్క‌డో ఒక చోట లైంగిక వేధింపుల‌కు గురి అవుతూనే ఉన్నారు. ప్ర‌జాప్ర‌తినిధుల హోదాలోనూ ఇలాంటి వేధింపులు ఎదుర్కోవాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న‌.

   

  బీజేపీ త‌మిళ‌నాడు మ‌హిళా నాయ‌కురాలు శ‌శిక‌ళ పుష్ప‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాల‌గ‌ణ‌ప‌తి టచ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయింది. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఆమె వ‌చ్చారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, జ‌నం విప‌రీతంగా ఉండ‌డంతో ఆయ‌న ఆమె ప‌క్క‌న నిలుచున్నారు. ఆమెకు దూరంగా ఉండ‌కుండా, ద‌గ్గ‌ర‌కు చేరి త‌న చేతివాటం ప్ర‌ద‌ర్శించారు.

   

  ఆమె చేతులు ప‌ట్టుకునేందుకు, చీర కొంగును ప‌క్క‌కు త‌ప్పించి న‌డుముపై చేయి వేసేందుకు ట్రై చేశారు. ఆమె ఆయ‌న చేతుల‌ను ప‌క్క‌కు నెట్టివేస్తున్నా… బాల‌గ‌ణ‌ప‌తి మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తించాడు. త‌న‌ను ఎవ‌రూ చూడ‌డం లేద‌ని ఇదంతా చేసినా.. కెమెరాల‌కు మాత్రం అడ్డంగా బుక్క‌య్యారు. డీఎంకే ఐటీ విభాగం ఆయ‌న వికృత చేష్ట‌ల‌ను స్లో మోష‌న్ లో ఎడిట్ చేసి.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది దావానంలా గుప్పుమంది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.