పానీపూరీ ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ లొట్టలేసుకుని మరీ లాంగించేస్తారు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా పానీపూరీ నోరూరిస్తుంటుంది. మనకే కాదండోయ్.. ఏనుగులు కూడా పానీపూరీ కనిపిస్తే గుటుక్కుమనకుండా ఉండవు.
అసోంలోని తేజ్ పూర్ జిల్లాలో ఓ గజరాజు రోడ్డు పక్కన పానీపూరీ అమ్ముతున్న వ్యక్తి వద్ద నిలబడింది. మావటి ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. ఏనుగు రావడంతోనే.. పానీ పూరీ అమ్మే వ్యక్తి వరుసగా ఒకొక్క పానీపూరీని ఏనుగు తొండానికి అందిస్తుంటే.. లటుక్కున అందుకుని గుటుక్కున మింగేసింది. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్ లొ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Everyone loves #PaniPuri 😅 pic.twitter.com/Ygz3V60CgH
— Dipanshu Kabra (@ipskabra) October 12, 2022
ఇవి కూడా చదవండి..