కామెడీ పృథ్వి కి ట్రాజిడీ తీర్పు.

  0
  338

  టాలీవుడ్ క‌మెడియ‌న్ కి విజ‌య‌వాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు పంచ్ వేసింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల 8 లక్షల రూపాయ‌ల భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ లోగా భరణం చెల్లించాలని తీర్పులో ఆదేశించింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌‌ తో 1984లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పృథ్వీరాజ్‌ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని, సెక్షన్‌ 498A గృహహింస చట్టం కింద శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

   

  తన భర్త పృధ్వీరాజ్ నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న ఆమె విజయవాడ ఫ్యామిలీ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. పెళ్లయిన తర్వాత తన భర్త పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించార‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం త‌న భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయ‌లు సంపాదిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించింది. ఈ కేసును విచారించిన‌ కోర్టు, ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.