ఆమె ఆస్తి కుక్కకే రాసింది.. ఎందుకో తెలుసా..?

  0
  298

  కుక్కలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. మరి కొందరికైతే కుక్కలంటే చచ్చేంత ఇష్టమూ ఉంటుంది.. కన్న బిడ్డలను పనివారికి అప్పగించేసి.. ఎక్కడికి వెళ్లినా కుక్కలను మాత్రం తమ వెంట తీసుకొని వెళ్లేవారూ మనకు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయేది అలాంటిలాంటి స్టోరీ కాదు.. ఈ స్టోరీ విన్నారంటే మీరు షాకైపోతారు. అమెరికా ప్లేబాయ్ మోడల్ జు ఇసెన్ కు కుక్కలంటే చాలా ఇష్టం. ఫ్రాన్సిస్కో అనే కుక్కను ఆమె గతకొంతకాలంగా పెంచుకొంటోంది. ఈ కుక్కంటే ఆమెకు అమితమైన పిచ్చి.. షూటింగుల కోసం బయటకు వెళ్లినా సరే.. వచ్చీ రాగానే ఈ కుక్కతో గడపనిదే ఆమెకు నిద్రపట్టదు. కొన్ని సార్లు ప్రైవేట్ జెట్ విమానాల్లో కూడా తనతో పాటూ ఆ కుక్కను తీసుకెళుతోంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఆమె తాజాగా చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపుగా 15 కోట్ల విలువైన ఆస్తిని ఆ కుక్కపేరిట రాసేసింది. వీటితో పాటూ ఓ ఖరీదైన అపార్టుమెంటుతో పాటూ.. రెండు లక్సరీ కార్లను కూడా ఆ కుక్కపేరిట రాసేసింది. ఆ కుక్క విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఈ ఆస్థి ఉపయోగపడుతుందని చెబుతోంది జు ఇసెన్.. బ్రెజిల్‌కి చెందిన ఈ 35 ఏళ్ల ఇసెన్… కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. కుక్కకు చెందే డబ్బు, ఆస్తులు.. తన తదనంతరం ఎవరైతే ఆ కుక్కను చూసుకుంటారో వారికే చెందేలా వీలునామా కూడా సిద్ధం చేసింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..