భార్యను బడివద్దన్న భర్త.. విడాకులిచ్చిన కోర్టు.

    0
    141

    భార్యను చదవనీయకుండా ఆటంకం కలిగించాడన్న అభియోగంపై కోర్టు , భార్యకోరిక మేరకు విడాకులు మంజూరు చేసింది. చదువుకోవాలన్న భార్యకోరికను మన్నించకపోగా , ఆమెను చదవనీయకుండా కొట్టడం అమానుషమని , అందువల్ల విడాకులు ఇస్త్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. భరణం కింద భర్త , విడాకులు తీసుకున్న భార్యకు నెలకు 10 వేల రూపాయలు చెల్లించాలని చెప్పింది. సిద్ధి పట్టణంలో స్నేహాప్రభ అనే యువతికి 13 ఏళ్ల వయసులో పెళ్ళిచేసారు. అప్పటికి ఆ బాలిక ఏడో తరగతిలో ఉంది. రజస్వల అయినా తరువాత కాపురానికి పంపారు. అయితే భర్త ఆమెను చదూకోనీయలేదు. పైగా రాత్రిళ్ళు పుస్తకం పట్టుకుంటే కొట్టేవాడు. దీంతోకొంత కాలానికి అమ్మగారింటికి వచ్చేసింది. తన చదువు కొనసాగించింది. చివరకు తొమ్మిదేళ్ల తరువాత , విడాకులకు దరఖాస్తు చేసింది. కేసు విచారించిన న్యాయమూర్తి విడాకులు మంజారు చేశారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..