సల్మా వలలో పడితే మటాష్..ఇలా చిక్కింది.

  0
  701

  కర్ణాటకలో సంచలనం సృష్టించిన హానీ ట్రాప్ కేసులో , అరెస్టయిన సల్మాభాను , వలలో పడి లక్షలు , కోట్లు పోగొట్టుకున్న అభాగ్యులు కథలు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి.. తనమాటలు , వయ్యారి చేష్టలు , అందచందాలతో వలలో వేసుకొని , తర్వాత వీడియోలు , ఫొటోలు తీసి , బ్లాక్ మెయిల్ చేయడం సల్మాభాను ప్రత్యేకత.. కర్ణాటక , మాండ్యలో ఆర్ ఎస్ ఎస్ నేత జగన్నాధషెట్టి కేసులో ఆమె ఇరుక్కుంది. దీంతో అరెస్టుచేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆమె చూపులవలలో చిక్కి మోసపోయిన వాళ్ళు ఫిర్యాదులు ఇస్తున్నారు. విచిత్రం ఏమిటంటే , ఆమె సామాజిక సేవకురాలు , మానవహక్కుల సంఘం నాయకురాలు ముసుగులో ఈ హానీ ట్రాప్ లకు పాల్పడుతుంది.

  జగన్నాధషెట్టి పలుకుబడిగలిగిన రాజకీయనాయకుడేకాదు , పొయెద్ద బంగారం దుకాణాల యజమాని కూడా .. ఆయనతో పరిచయం ఆమె నాటకీయంగానే చేసింది.. జగన్నాధషెట్టి ప్రతిరోజూ కారులో పోయే దారిలో , ఒక రోజు లిఫ్ట్ అడిగింది. తరువాత మాటలు కలిపింది. ఫోన్ నంబర్ తీసుకుంది. మొదట , లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అనే మెస్సేజ్ తో మొదలుపెట్టింది. తరువాత చాటింగ్ , ఆ తరువాత వీడియో కాల్స్.. కట్ చేస్తే , హోటల్లో సరసాలు , రహస్యంగా వీడియోలు .. చివరగా బ్లాక్ మెయిల్.. ఈమె ముఠాలో నలుగురు సభ్యులున్నారు. .

  సరసాలు మొదలైన రెండు నెలల తరువాత , చిన్నగా , నాలుగు కోట్లు రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. ఇవ్వలేనని అంటే , 50 లక్షలకు సెటిల్ చేసుకుంది. డబ్బులు ఇచ్చిన తరువాత వీడియోలు ఇస్తానని చెప్పింది. అయితే 50 లక్షలు తరువాత , మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో జగన్నాధషెట్టి పోలీసులను ఆశ్రయించాడు. అన్ని ఆధారాలతో పోలీసులు సల్మాభాను ఆమె అనుచరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.