పేరు దత్త..రేషన్ కార్డులో కుక్క అని రాశారు.

  0
  392

  రేష‌న్ కార్డులో త‌న పేరు త‌ప్పుగా ముద్రించార‌ని, ఆ పేరును స‌రి చేయాల‌ని ఓ వ్య‌క్తి అర్జీ పెట్టుకున్నాడు. అయితే అధికారులు మాత్రం ఆ వ్య‌క్తి గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వినూత్న‌రీతిలో నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. కుక్క‌లాగా అరుస్తూ త‌న బాధ‌ను క‌లెక్ట‌ర్ వ‌ద్ద వెళ్ళ‌బోసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

  శ్రీకాంతి కుమార్‌ దత్తా అనే వ్యక్తి పేరును రేషన్‌ కార్డులో శ్రీకాంతి కుమార్‌ కుత్తాగా ముద్రించారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దీంతో తన పేరును మార్చాలని ఎన్నోసార్లు ద‌ర‌కాస్తు చేసుకున్నాడు. అయినా అధికారులు ప‌ట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ కుక్క‌లాగా అరుస్తూ వినూత్నంగా నిరసనకు దిగాడు.

  బంకురా జిల్లా క‌లెక్ట‌ర్ ఓ గ్రామంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆ విష‌యం తెలిసిన శ్రీకాంతి కుమార్ ద‌త్తా అక్క‌డికి చేరుకున్నాడు. క‌లెక్ట‌ర్ వ్యానులో ఉండ‌గా… శ్రీకాంత్ త‌న అర్జీ చేతిలో ప‌ట్టుకుని.. కుక్క‌లా అరుస్తూ త‌న ఆవేద‌న‌ను వెళ్ళ‌గ‌క్కాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.