ఒకటే శరీరం, రెండు తలలు.. ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వేస్తారో ఊహించండి..?

    0
    51

    ఒకటే శరీరం, రెండు తలలు.. ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వేస్తారో ఊహించండి..?

    పంజాబ్ లో ఇద్దరు అన్నదమ్ములున్నారు. అమృత్ సర్ కి చెందిన సోహన్ సింగ్, మోహన్ సింగ్ ఇద్దరూ కన్జాయింట్ ట్విన్స్. అంటే శరీర భాగాలు అతుక్కుపోయి పుట్టిన కవలలు అన్నమాట. అయితే వీరికి ఇటీవలే 18 ఏండ్లు నిండాయి. దీంతో ఇద్దరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడే అధికారులు సందిగ్ధంలో పడ్డారు. వారికి ఎన్ని ఓట్లు ఇవ్వాలి, ఎలా ఓటు వేయించాలి అని ఆలోచించారు.

    శరీరం ఒకటే అయినా రెండు ముఖాలు ఉన్నాయి కాబట్టి, ఇద్దరుగా పరిగణించి రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చారు. 12వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ ఎస్. కరుణ రాజు ఇద్దరికీ వేర్వేరుగా రెండు ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్‌ లను అందజేశారు.

    ఇక పోలింగ్ రోజు రానే వచ్చింది. తొలిసారిగా ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాగో తెలుసా..? ఇద్దరూ ఒకేసారి పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. ఓటు హక్కు రహస్యం కాబట్టి.. ముందు సోహన్ కళ్లకు గంతలు కట్టినట్టు అద్దాలు పెట్టారు, అప్పుడు మోహన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటు వేశాడు. ఆ తర్వాత మోహన్ కళ్లకు అద్దాలు తగిలించారు, సోహన్ ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

    వీరిద్దరిదీ దీన గాథ..
    జూన్ 2003లో ఢిల్లీలో జన్మించిన ఈ కవలలను వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే వదిలేశారు. వదిలించుకున్నారు. కానీ అమృత్‌ సర్‌ లోని ఓ అనాథ శరణాలయం వారిని దత్తత తీసుకుంది. అప్పటినుంచి వీరిద్దరూ అక్కడే పెరుగుతున్నారు. వారికి పంజాబ్ విద్యుత్ శాఖ ఉద్యోగాలిచ్చింది. ఆ తర్వాత ఇప్పుడిలా తొలిసారి వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..