పెళ్లికూతురు ముందే మాజీ ప్రియుడు రక్తతిలకం ..

    0
    155

    సినిమాల్లో కూడా చూడని ఓ ప్రేమికుడి దురాగతం ఇది. తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుంటే, పెళ్లి మండపం మీదకు వెళ్లి కత్తితో గొంతు కోసుకుని రక్తం కారుతుండగా.. ఆ రక్తంతో పెళ్లి కూతురికి తిలకం దిద్దాడు ఈ ఉన్మాద ప్రేమికుడు. అనుకోని ఈ సంఘటనకు షాక్ తిన్న పెళ్లి కొడుకు, జరుగుతున్న తతంగాన్ని కళ్లప్పగించి చూస్తున్నాడు.

    అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో పెళ్లికి వచ్చిన వారంతా ఉన్మాద ప్రియుడిపై దాడి చేసి కొట్టారు. ఈలోగా పోలీసులు జోక్యం చేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియుడిని ఆస్పత్రికి తరలించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ ఘర్ లో ఈ సంఘటన జరిగింది. రెహులా గంజ్ అనే గ్రామానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెళ్లకి ఒకేరోజు పెళ్లి చేస్తున్నారు.

    పెళ్లి కొడుకులు కూడా అన్నదమ్ములే. వారిలో ఒక యువతికి పెళ్లికి మందే ప్రేమ వ్యవహారం నడిచింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారు కుదిర్చిన సంబంధాన్నే చేసుకోడానికి సిద్ధమైంది. అయితే ఈలోగా ప్రియుడు వచ్చి, పెళ్లి మండపంలో గొంతు కోసుకుని, ఆ రక్తంతో పెళ్లి కూతురు నుదుట తిలకం దిద్దడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది.

    ఆ తర్వాత ఇద్దరు పెళ్లి కూతుళ్లు, పెళ్లి కొడుకులు పెళ్లి మండపం వదిలేసి, కుందా.. అనే గ్రామంలో ఉన్న ఆలయంలో అదే మహూర్తానికి పెళ్లి చేసుకున్నారు. ఏ సినిమాల్లో కూడా ఇలాంటి ఉన్మాద ఘటనలు చూపించలేదు. అయినా ఆ ప్రేమికుడు ఇలా బరితెగించాడు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..