వివో ప్రచారం కోసం మరీ ఇంతలా చేయాలా..?

  0
  99

  వివో ప్రచారం కోసం మరీ ఇంతలా చేయాలా..?

  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కెప్టెన్సీకి దూరమైనా ఇంకా విరాట్ క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవమే. టీమిండియాలో ఉన్నంతకాలం అతని క్రేజ్ కి కొదవే ఉండదు. మనోడు ఇటీవల వివో స్మార్ట్ ఫోన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ఫొటో షేర్ చేశాడు విరాట్. అయితే ఆ ఫొటోలో అందరూ విరాట్ కోహ్లీ లాగానే డ్రస్సింగ్, హెయిర్ స్టైల్, గడ్డం పెంచుకుని ఉంటారు.

  ఫైండ్ ద ఆడ్ వన్ ఔట్.. అంటూ ఆ ఫొటోకి క్యాప్షన్ పెట్టాడు విరాట్. అయితే ఆ ఫోటో వివో వి-11 ప్రో అనే కెమెరాతో తీసినట్టు మనకు కనపడుతుంది. వివో అడ్వర్టైజ్ మెంట్ కోసమే విరాట్ ఆ ఫొటోని అప్ లోడ్ చేశాడని కామెంట్లు వస్తున్నాయి. ఇంతకీ ఆడ్ మ్యాన్ ఎవరో, వారిని ఎందుకు కనిపెట్టాలన్నారో విరాట్ కే తెలియాలి. అసలు సంగతి మాత్రం ఆ క్రికెటర్ ఇంకా రివీల్ చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..