ప్రధాని మోదీకి సీఎం జగన్ మరో లేఖ..

  0
  110

  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ప్రత్యామ్నాయాలు చూడాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. తాజాగా.. పార్లమెంట్ లో ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇచ్చిన సమాధానంతో మరోసారి ప్రైవేటీకరణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సీఎం జగన్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటనపై మాట్లాడేందుకు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వాలని ఆయన ఈ లేఖలో కోరారు. అఖిలపక్షంతో కలిసి విశాఖ ఉక్కుపై నేరుగా ప్రధానిని కలిసి మాట్లాడేందుకు అనుమతివ్వాలని కూడా కోరారు.

  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్లాంట్ ప్రైవేటీకరణ జరక్కుండా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని తాను రాసిన లేఖలోని అంశాలను మరోసారి ప్రస్తావించారు సీఎం జగన్. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను లాభాల బాట పట్టించేందుకు ఉక్కు శాఖ మంత్రికి సూచనలు ఇచ్చానని ఆయన ఈ లేఖలో తెలిపారు. ‘‘ ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థ వద్ద 7వేల ఎకరాలు ఉపయోగించని భూమి ఉంది. ప్లాట్ల కింద మార్చి ఆర్‌ఐఎన్‌ఎల్‌ను ఆర్థికంగా బలపరచవచ్చు’’ అని సీఎం సూచించారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..