హాస్యనటుడు ఆలీకి రాజ్యసభ ఖాయమైందా.. ?

  0
  216

  అలీకి రాజ్యసభ కన్ఫామ్.. ఇదిగో సాక్ష్యం..
  సినీనటుడు అలీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీ.. ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పర్యటించారు, ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు పదవి ఇస్తారని అనుకున్నా ఇంకా సాధ్యం కాలేదు. తాజాగా ఆయన చిరంజీవి బృందంతో కలసి సినిమా టికెట్ల వ్యవహారంలో సీఎం జగన్ ని కలిశారు. అప్పుడు ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేసినట్టు పుకార్లు గుప్పుమన్నాయి. ఇప్పుడు మరో దఫా అలీని సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు.

  ఈ సందర్భంగా ఆయనకు రాజ్యసభ కన్ఫామ్ అయినట్టు వార్తలు వెలువడ్డాయి. గతంలో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా తాను పోటీ చేయనన్నానని చెప్పారు అలీ. కొద్ది రోజుల్లో పార్టీ పెద్దలు ప్రకటన చేస్తారని హింట్ ఇచ్చారు. రాజ్యసభ ఇస్తారా, మరో పదవి ఇస్తారా అనేది క్లారిటీ లేదన్నారు. అలీ వ్యాఖ్యలతో ఆయనకు రాజ్యసభ కన్ఫామ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒకటి మైనార్టీ కోటాలో అలీకి ఇస్తారనే వార్తలకు ఇప్పుడు బలం చేకూరింది.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..