ఓ ఎద్దు రైలు ఎక్కింది. ఎక్కి రైలు ప్రయాణించిన దూరం వెళ్ళింది. ఈ వింత ఘటన జార్ఖండ్ లో జరిగింది. సాహిబ్‌గంజ్‌కు వెళ్ళే రైలులో ఓ ఎద్దు ఎక్కేసింది. ఎద్దు ఎక్కడంతోనే ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. ఇక రైలు కూడా కదిలింది. ఎద్దు కూడా ట్రైన్ జర్నీ చేసింది. గమ్య స్థానం వరకు అది రైలులోనే ప్రయాణించింది. అది రైలు ఎక్కేటప్పుడు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు.
అసలు ఎద్దు రైల్వే స్టేషన్ లోకి ఎలా వచ్చిందో.. ఎవరో ఎక్కించారో.. ఆ సమయంలో రైల్వే అధికారులు ఏం చేస్తున్నారో ..? కానీ.. ఎద్దు మాత్రం ఎంచక్కా రైలు ప్రయాణం చేసేసింది. ఇదీ రైల్వేశాఖ పని తీరు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో పశ్చిమ బెంగాల్ లో ఓ గుర్రం కూడా ఇలాగే రైలు ప్రయాణం చేసింది. అప్పుడు కూడా నెటిజన్లు రైల్వేశాఖ తీరుపై సెటైర్లు వేశారు.
अब इसे क्या कहेंगे! अब तक साइकिल, दूध का केन, सब्जी आदि लेकर बिहार की ट्रेनों में यात्रा करते देखा होगा. अब एक तस्वीर ये भी देखिए. मिर्जाचौकी से साहिबगंज जाने के दौरान मिर्जाचौकी रेलवे स्टेशन पर लोकल पैसेंजर में कुछ अज्ञातों ने क्या कारनामा किया है. वीडियो- भागलपुर से दिलीप pic.twitter.com/ELdIfXuE1s
— Prakash Kumar (@kumarprakash4u) August 5, 2022