వందేళ్ల తరువాత మైసూరు , హైదరాబాద్ మాజీ సంస్థానాధీశుల భేటీ..

  0
  71

  మైసూర్, హైదరాబాద్ మాజీ సంస్థానాధీశుల భేటీ వందేళ్ల తర్వాత జరిగింది. మైసూర్ లో నిజాం నవాబు మనవడు మీర్ నజాఫ్ ఆలీఖాన్, రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త ఒడయార్ ని కలుసుకున్నారు. వారిద్దరూ గంటకు పైగా చర్చలు జరిపారు. గత వందేళ్ల కాలంలో ఈ రెండు రాజ కుటుంబాలు కలసి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. తమ పెద్దల స్నేహం, గత స్మృతులను, అప్పటి ఫొటోలను పంచుకున్నారు. గత వైభవాలను నెమరువేసుకున్నారు.

  ఈ సందర్భంగా మైసూర్ రాజకుటుంబీకులు, యదువీర్ కృష్ణ దత్త ఒడయార్ మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలనలో నవాబ్ అసిఫ్ జా అప్పటి భారత దేశ రాజులకు అండగా నిలబడ్డారని చెప్పారు. 1965 భారత్, చైనా యుద్ధంలో హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 5వేల కిలోల బంగారాన్ని దేశానికి విరాళంగా ఇచ్చారని తెలిపారు.

  మైసూరు రాజ భవనం నిర్మాణంలో నిజాం నవాబుల సహకారం ఎంతో ఉందని, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ని కూడా నిజాం నవాబులు ఇంజినీర్లను పంపించి నిర్మాణంలో సహకరించారని అన్నారు. వందేళ్లనాటి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మరియు నవాబ్ మీర్ నజఫ్ అలీ ఖాన్ ఫొటోలను మైసూర్ రాజవంశీకులు చూపించారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..