కలలో కూడా ఊహించని కాల్.పేదవాడి దశ తిరిగింది..

  0
  1689

  ఓ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన మంచిపని ఇంత గౌరవం తెస్తుందని ఆ పేదవాడికి తెలియదు.. అయితే ఇప్పుడు ఆ పేద డెలివరీ బాయ్ ఉన్నపళంగా దుబాయ్ లో సెన్సేషన్ అయ్యాడు.. ఎందుకంటే , సాక్షాత్తు దుబాయ్ రాజు అతడికి ఫోన్ చేసి , అతడు చేసిన మంచిపనికి థాంక్స్ చెప్పి , తాను విదేశీ పర్యటననుంచి వస్తూనే , కలుస్తానని చెప్పాడు. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ , ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు.. ఇంతకీ అతడు చేసిందేమిటో చూడండి.. తన డ్యూటీ మీద పోతున్నప్పుడు , ఒక చోట మెయిన్ రోడ్లో రెండు ఇటుకలు పడిపోయిఉన్నాయి. ఆ వ్యక్తి , తన బైక్ పక్కన ఆపి , వాహనాలు అన్నీ పోయేదాకా వేచి చూసి , ఆ రెండు ఇటుకలను , రోడ్డుపక్కన పెట్టిపోయాడు..

  ఇది సిసి కెమెరాలో రికార్డ్ అయింది. దుబాయ్ పోలీసు దీన్ని ట్విట్టర్ లో పెట్టింది. వెంటనే రాజు స్పందించి , అతడిని కలుసుకుంటానని చెప్పాడు. చెప్పడమే కాదు , అతడెవరో చెప్పమంటూ ట్వీట్ చేసాడు. పోలీసులు అతడెవరో కనుక్కొని , ఫోన్ నంబర్ రాజుకు ఇచ్చారు. తన ఫోన్ నుంచే , దుబాయ్ రాజు , అతడికి ఫోన్ చేసాడు.

  మొదట ఆయువకుడు ఫోన్ తీయలేదు. తర్వాత , పోలీసు చీఫ్ , అతడి ఇంటికెళ్లి విషయంచెప్పాడు. తరువాత మళ్ళీ దుబాయ్ రాజే స్వయంగా , ఆ యువకుడుకి ఫోన్ చేసి థాంక్స్ చెప్పాడు.. స్వయంగా కలుస్తానని హామీ ఇచ్చారు.. దుబాయ్ రాజు ను కలవడం అంటే , అది మాటల్లో చెప్పలేనంత అసాధ్యం.. అలాంటిది , ఓ యువకుడు చేసిన మంచి పనికి , రాజే స్వయంగా అతడిని కలుస్తానని ఫోన్ చేయడమంటే నిజంగా గొప్ప విషయమే..

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.