ఫొటోగ్రాఫర్ కి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ బాయ్ ఫ్రెండ్..

  0
  387

  హీరోయిన్ ని ఫొటో తీయడానికి ఓ ఫొటోగ్రాఫర్ ఏకంగా గోడ ఎక్కేశాడు. అతడి అత్యుత్సాహం చూసి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్, హీరో అర్జున్ కపూర్ సీరియస్ అయ్యాడు. ఏంటిది అంటూ కసురుకున్నాడు.

  తన కంటే వయసులో 12 ఏళ్లు పెద్దదైన, ఓ బిడ్డకు తల్లి కూడా అయిన హీరోయిన్ మలైకా అరోరాతో సహజీవనం చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం 2018 నుంచి అర్జున్‌ కపూర్ తో మలైకా డేటింగ్ చేస్తోంది మలైకా.

  వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతుంటారు. తాజాగా వీరిద్దరూ బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఇంటికి విచ్చేశారు.

  కరీనా ఇటీవల మగబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని చూసేందుకు అర్జున్, మలైక ముంబైలోని సైఫ్ ఇంటికి వెళ్లారు. ఒకే కారు నుంచి దిగిన వీరిద్దరినీ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.

  ఓ ఫొటోగ్రాఫర్ ఏకంగా సైఫ్ ఇంటి గోడ కూడా ఎక్కేశాడు. అతనిని చూసిన అర్జున్ కపూర్ అసహనం వ్యక్తం చేశాడు. `ఇది చాలా పెద్ద తప్పు. ముందు గోడ దిగండి. ఇంటి గోడలు ఇలా ఎక్కకూడదని వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యవహారం అంతా ఫొటోలతో సహా బయటకు రావడంతో అది వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?