కొడుకు డబ్బుతో జాక్ పాట్ కొట్టేశాడు,

  0
  471

  అదృష్ట‌మంటే అత‌డిదే. కొడుకు కిడ్డీ బ్యాంక్ లోని నుంచి తీసి లాట‌రీ టిక్కెట్ కొన్నాడు. అంతే… ఆ లాట‌రీతో జాక్ పాట్ కొట్టేశాడు. ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 25 కోట్లు. కేర‌ళ రాష్ట్రంలో ఇది జరిగింది. తిరువ‌నంత‌పురం న‌గ‌రంలోని శ్రీవ‌రాహం ప్రాంతంలో ఆటో డ్రైవ‌ర్ అనూప్ భార్య‌, కొడుకుతో ఉంటున్నాడు. ఇత‌నికి లాట‌రీలు కొనే పిచ్చి ఉంది. చాలాసార్లు లాట‌రీ కొన్నాడు. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. కానీ ఈసారి మాత్రం బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశాడు.

   

  లాట‌రీ కొనేందుకు 500 రూపాయ‌లు కావాలి. కానీ అత‌ని వ‌ద్ద 450 రూపాయ‌లే ఉన్నాయి. మిగ‌తా 50 రూపాయ‌ల కోసం.. కొడుకు కిడ్డీ బ్యాంకును ప‌గ‌ల‌కొట్టి తీసుకున్నాడు. ఆ న‌గ‌దుతో టీజే 750605 నంబరు గల లాట‌రీ టిక్కెట్ కొన్నాడు. ఆ టిక్కెట్ కు బంప‌ర్ ప్రైజ్ త‌గిలింది. ఏకంగా 25 కోట్ల రూపాయ‌ల లాట‌రీ త‌గ‌ల‌డంతో.. అనూప్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. కొడుకు డ‌బ్బుతో కొన్న లాట‌రీ టిక్కెట్ కి జాక్ పాట్ రావ‌డంతో.. ఆ కుటుంబం ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ఈ అదృష్ట‌మంతా నా కొడుకుదే అంటూ పొంగిపోతున్నారు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.