వాలెంటైన్స్ డే సంబరాల్లో వీళ్ళిద్దరూ ఉత్సాహంగా , ఉల్లాసంగా ..

  0
  681

  వాలంటైన్స్ డే యువ‌తీ యువ‌కులు, ఆడ‌, మ‌గ… ప్రేమికులు, భార్యాభ‌ర్త‌లే కాదు స్వ‌లింగ సంప‌ర్కుల సెల‌బ్రిటీల జంట కూడా వైభ‌వంగా జ‌రుపుకుంది. బాలీవుడ్ సినీ ర‌చ‌యిత అపూర్వ ఆస్రాని గ‌త గే ల‌వ‌ర్ సిద్దాంత్ తో క‌లిసి వాలెంటైన్స్ డేని ఘ‌నంగా జ‌రుపుకున్నాడు. గ‌త 13 ఏళ్ళుగా వీళ్ళిద్ద‌రూ జంట‌గానే ఉంటున్నారు. స‌మాజానికి భ‌య‌ప‌డి, తామిద్ద‌రం గే అని చెప్పుకోవ‌డానికి సిగ్గుప‌డి ఇద్ద‌రూ క‌జిన్స్ అని చెప్పుకుంటూ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తేడాదే ఇద్ద‌రూ క‌లిసి కొత్త ఇల్లు కొనుక్కుని తామిద్ద‌రం స‌హ‌జీవ‌నం చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డామ‌ని, తాము స్వ‌లింగ సంపర్కుల‌మ‌ని ఘ‌నంగా చెప్పుకుంటున్నారు.

  https://indianexpress.com/article/entertainment/bollywood/apurva-asrani-buys-house-with-partner-siddhant-6434387/

  కొత్త‌గా కొన్న ఇంటికి కూడా అపూర్వ సిద్ధాంత్ అనే నేమ్ ప్లేట్ త‌గిలించారు. స‌మాజం కూడా  స్వ‌లింగ సంప‌ర్కుల మ‌నోభావాల‌ను గౌర‌వించాల‌ని అన్నారు. స‌మాజానికి భ‌య‌ప‌డే తామిద్ద‌రం ఇంత‌కాలం  క‌జిన్స్ అనే ముసుగేసుకుని స‌హ‌జీవ‌నం చేశామ‌ని చెప్పుకొచ్చారు. స్వ‌లింగ సంప‌ర్కులంటే ఇల్లు అద్దెకు కూడా ఇవ్వ‌డం లేద‌ని, అందువ‌ల్లే సొంత ఇల్లు కొనుక్కుని, ఇప్పుడు ఆ ముసుగు తీసేశామ‌ని తెలిపారు.

  ప్ర‌పంచంలో అనేక దేశాలు స్వ‌లింగ సంప‌ర్క బంధాన్ని చ‌ట్ట‌బ‌ద్దం చేశాయ‌ని మ‌న దేశంలో కూడా గే సంబంధాల‌ను అనుమ‌తించే విధంగా చ‌ట్టం చేయాల‌ని కోరారు. స్వ‌లింగ సంప‌ర్కం నేరం కాద‌ని, ఈ చర్య ఐపీసీ సెక్షన్ 377 పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. తాము ధైర్యంగా ముంద‌డగు వేసి, త‌మ బంధాన్ని బ‌హిర్గ‌తం చేశామ‌ని చెప్పారు. స‌మాజం కూడా త‌మ మ‌నోభావాలు గౌర‌వించి,  మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అపూర్వ రాసిన అనేక టీవీ సీరియ‌ల్స్, సినిమాల్లో గేకు అనుకూలంగా స‌న్నివేశాలు కూడా రాసిన సంద‌ర్భాలున్నాయి.

  https://ndnnews.in/suhasinimooleywnderlovestory/