హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య?

    0
    165

    హిజాబ్ ధరించడంపై కర్నాటక హైకోర్టు తీర్పు.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్‌ 15 లాంటి వాటిని ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పారు. ముస్లిం మహిళల మీద ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్నారు. వాళ్లు లక్ష్యంగా మారుతారన్నారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదని, హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య? అని ఒవైసీ స్పందించారు.

    తీర్పు వెలువడిన వెంటనే ట్విటర్‌లోనూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను ఏకీభవించను. తీర్పుతో విభేదించడం నా హక్కు. పిటిషనర్లు సుప్రీం కోర్టు ముందు అప్పీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను, మతం, సంస్కృతి, స్వేచ్ఛపై ప్రాథమిక హక్కులను నిలిపివేసినందున @AIMPLB_Official మాత్రమే కాకుండా ఇతర మత సమూహాల సంస్థలు కూడా ఈ తీర్పును అప్పీలు చేయాలని ఆశిస్తున్నాను అంటూ వరుస పోస్టులు చేశారు.

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..