తండ్రి అమ్మేసిన బుల్లెట్ కోసం 25 ఏళ్ళు వేట..

  0
  1152

  చిన్నప్పుడే తప్పిపోయిన బిడ్డల కోసం తల్లిదండ్రుల నిరంతర అన్వేషణ ఎలా ఉంటుందో తెలుసు , అలాగే తప్పిపోయిన తల్లిదండ్రుల కోసం వెతికే కొడుకుల బాధ కూడా ఎలా ఉంటుందో వారికే తెలుసు… అయితే ఇక్కడ నమ్మలేని నిజం ఒకటుంది. తన తండ్రి అమ్మేసిన బుల్లెట్ బైక్ కోసం ఒక కొడుకు 25 సంవత్సరాలుగా చేసిన అన్వేషణ , వేట చివరకు ఫలించింది. ఏ కథలోనూ, సినిమాలోనూ, సీరియల్ లో కూడా ఇలాంటి అన్వేషణ మనం చూసి ఉండం. బుల్లెట్ బైక్ అంటే చాలామందికి అదొక సెంటిమెంట్. ప్రపంచంలో 100 ఏళ్లకు పైబడి ఉన్న బైక్ కంపెనీల్లో బుల్లెట్ సంస్థ కూడా ఒకటి. ఇప్పటివరకు ఎన్ని బైకులు వచ్చినా బుల్లెట్ బైక్ మీద ప్రేమ అనంతమైనది. దాన్ని వాడేవారు , ఒక పట్టానా వదలరు. అలాంటి ప్రేమే ఓ వ్యక్తిని తన తండ్రి అమ్మేసిన బుల్లెట్ బైక్ మళ్లీ వెతికి తెచ్చుకునేందుకు కారణమైంది . ఈ నిరంతర అన్వేషణకు 25 సంవత్సరాలు పట్టింది. హాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్ కథలను మరిపించే విధంగా ఇది ఉంది.

  కర్ణాటకలోని అరుణ్ అనే వ్యక్తి తండ్రి బుల్లెట్ 1971 మోడల్ ని 1990లో అమ్మేశాడు. ఆ డబ్బులతో బజాజ్ చేతక్ స్కూటర్ కొన్నాడు . అయితే తండ్రి అమ్మేసిన బుల్లెట్ అంటే కొడుక్కు ఎనలేని ప్రేమ. చిన్నవాడు కావడంతో ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. సొంతంగా సంపాదన మొదలుపెట్టిన తర్వాత తండ్రి అమ్మేసిన బైక్ కోసం అరుణ్ అన్వేషణ మొదలుపెట్టాడు . దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఎంవైహెచ్1731 . మొట్టమొదటగా ఈ బైక్ రిపేర్ చేసే మెకానిక్ దగ్గరికి వెళ్లి తన తండ్రి వద్ద బైకు కొనుగోలు చేసిన వ్యక్తి ఎక్కడ ఉంటాడని విచారించాడు. ఆ తర్వాత అతడు మణిపాల్ లో ఉంటాడని తెలుసుకొని మణిపాల్ కు వెళ్ళాడు. తన తండ్రి స్నేహితుడిని ఈ బైక్ గురించి అడిగాడు. అయితే 1996లో తనవద్ద ఆ బైకు చోరీకి గురైందని తండ్రి స్నేహితుడు చెప్పాడు .

  ఆ తర్వాత చోరీ చేసిన మోటార్ సైకిల్స్ ను కనుగొని పరివాహన యాప్ ద్వారా ప్రయత్నాలు చేశాడు కానీ అవివేవి ఫలించలేదు మాండ్యాలో20 వరకు మళ్లీ అన్వేషణ ప్రారంభించి 2021లో మాండ్యాలో ఈ నంబర్ గల మోటార్ సైకిల్ ఒకరి పేరుతో రిజిస్టర్ అయిందని గమనించారు. అడ్రెస్స్ దొరకలేదు. ఆ తర్వాత దాని ఇంజన్, చాసిస్ నంబరు, ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు తీసుకొని బైక్ ఎవరి దగ్గరవుందో ఇన్సూరెన్స్ కంపెనీలో కనుక్కున్నాడు. .అక్కడికెళ్ళాడు. ఈ బైక్ ను చోరీ సొత్తు గా పరిగణించి , మాండ్య పోలీసులు వేలం వేస్తే తాను కొన్నానని జికేరావు అనే వ్యక్తి చెప్పాడు.

  ఈ బైక్ గురించి తాను గత 25 ఏళ్లుగా చేస్తున్న అన్వేషణను అరుణ్ ఆయనకు చెప్పడంతో అతడు కూడా కదిలిపోయాడు. తండ్రి అమ్మేసిన బుల్లెట్ బైక్ మీద కొడుకు ప్రేమకు కరిగిపోయాడు . దీంతో బైక్ అమ్ముతానని చెప్పాడు. ఎంత ధర చెప్పినా తాను బైకు కొంటానని అరుణ్ చెప్పడంతో ఆ బైక్ ని చివరకు మంచి ధర తీసుకుని అరుణ్ కి అమ్మేశాడు. తండ్రి అమ్మేసిన బుల్లెట్ బైక్ మీద కొడుకు ప్రేమ, దానికోసం అతడు సాగించిన అన్వేషణ , వేట సామాన్యమైందికాదు. మంచంలో ఉన్న తండ్రికి ఆ బైక్ చూపిస్తే తండ్రి కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. తండ్రికి , తనకు ఇష్టమైన బైక్ ని అమ్మేసిన తరువాత, కొడుకు 25 ఏళ్ల పాటు దీనికోసం ఎలా అన్వేషించాడో తెలిస్తే మాత్రం ఎవరికైనా శభాష్ అనక తప్పదు..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here