రాణి రాజదండంలో ఉన్న మా వజ్రం మాకివ్వండి..

  0
  84

  ఏడు దశాబ్దాల పాటు యూకేను పాలించిన మ‌హారాణి ఎలిజబెత్‌-2 అస్త‌మించిన నేప‌ధ్యంలో అమూల్య‌మైన కోహినూర్ వజ్రం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతోపాటు దక్షిణాఫ్రికా ‘స్టార్ ఆఫ్ ఆఫ్రికా’ వజ్రం ప్ర‌స్తావ‌న కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలోని 2,800 వజ్రాల్లో కోహినూర్ వ‌జ్రాన్ని పొదిగారు. దక్షిణాఫ్రికాకి చెందిన‌ ‘స్టార్ ఆఫ్ ఆఫ్రికా’ వజ్రం రాజదండంలో పొదిగారు. ఇప్పుడు రాణి మ‌ర‌ణించ‌డంతో త‌మ సంప‌ద‌ను త‌మ దేశాల‌కు తిరిగి ఇచ్చేయాల‌ని డిమాండ్ పెరుగుతోంది.

  కోహినూర్ వజ్రానికి ఘ‌న‌ చరిత్రే ఉంది. మ‌న‌దేశం లోని గోల్కొండ గనుల్లో 14వ శతాబ్దంలో మొట్టమొదట కోహినూర్ వజ్రం దొరికిందని చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ పాల‌న‌పై ఈ వ‌జ్రం వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1849 నుంచి బ్రిటిష్ రాణి కిరీటంలో కోహినూర్ ఉంది. ఇప్పుడామె మ‌ర‌ణించ‌డంతో దీన్ని తిరిగి భారత్‌కు రప్పించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. భారత్‌ నుంచి దోచుకున్న పురాతన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేయాలని, భార‌త ప్ర‌భుత్వం అందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. గ‌తంలోనూ కోహీనూర్ పై ప‌లుద‌ఫాలు సంప్ర‌దింపులు జ‌రిగాయి. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇప్పుడైనా సీరియ‌స్ గా ఈ విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించి, వెన‌క్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరుతున్నారు.

  ఇక బ్రిట‌న్ రాణి రాజ‌దండంలో ఆఫ్రికా వ‌జ్రం ‘స్టార్ ఆఫ్ ఆఫ్రికా’ కూడా ఉంది. దీన్ని తిరిగి ఇచ్చేయాల‌ని ఆ దేశాధినేత‌లు కోరుతున్నారు. 1905లో దక్షిణాఫ్రికాలో నిర్వ‌హించిన త‌వ్వ‌కాల్లో ఈ అమూల్య‌మైన వ‌జ్రం బ‌య‌ట‌ప‌డింది. ఆఫ్రికా దేశం కూడా ఒక‌ప్పుడు బ్రిటీష్ క‌బంధ హ‌స్తాల్లో చిక్కుకున్న దేశ‌మే. ఆ స‌మ‌యంలోనే ఈ వ‌జ్రం కూడా వారి చేతిలోకి పోయింది. అయితే మ‌రో వాద‌న కూడా ఉంది.

   

  ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం ఆ వజ్రాన్ని కొనుగోలు చేసి, తన విధేయతకు చిహ్నంగా బ్రిటిష్ రాజ‌ కుటుంబానికి బ‌హుమ‌తిగా అందించింది. పట్టాభిషేక సమయంలో చేత పట్టుకునే రాజదండంలో ఈ వ‌జ్రాన్ని పొదిగ‌బ‌డి ఉంది. అయితే.. చాలా మంది ఆ వజ్రాన్ని దొంగిలించారని అక్క‌డి ప్ర‌జ‌లు చెప్తారు. దాని అసలు యజమాని దక్షిణాఫ్రికా దేశ‌మ‌నే అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తానికి బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్-2 మ‌ర‌ణంతో కోహినూర్, స్టార్ ఆఫ్ ఆఫ్రికా వ‌జ్రాల అంశం హాట్ టాపిక్ అయింది

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.