స్నేహితులతో ప్రియుణ్ణి కొట్టి చంపేసింది..

  0
  206

  బెంగుళూరులో ఓ యువ‌తి త‌న స్నేహితుల స‌హాయంతో ప్రియుడిని కొట్టి చంపేసింది. చెన్నైకి చెందిన 27 ఏళ్ళ వికాష్ బెంగుళూరులో డాక్ట‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. అత‌డికి బెంగుళూరుకే చెందిన ప్ర‌తిభ అనే యువ‌తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీసింది. ఇద్ద‌రూ పెళ్ళి చేసుకునేందుకు నిర్ణ‌యించుకున్నారు. అందుకు పెద్ద‌లు అంగీక‌రాం తెలిపారు. ఇటీవ‌ల ప్ర‌తిభ త‌న ప్రియుడు వికాష్ ఇన్ స్టా గ్రాం అకౌంట్ చెక్ చేసింది. అందులో ప్ర‌తిభ న‌గ్న ఫోటోలు, తామిద్ద‌రూ శృంగారంలో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు క‌నిపించాయి. ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య త‌గాదా జ‌రిగింది.

   

  ప్ర‌తిభ త‌న మ‌రో ముగ్గురు స్నేహితులు సుశీల్, గౌత‌మ్, సూర్య‌ల‌తో త‌న ప్రియుడు త‌న న‌గ్న ఫోటోల‌ను ఇన్ స్టా గ్రాంలో పెట్టాడ‌ని, అత‌డి మీద దాడి చేద్దామ‌ని చెప్పి వారిని తీసుకుని వికాష్ గ‌దికి వెళ్ళింది. అక్క‌డ వాళ్ళంతా క‌లిసి వికాష్ ను కొట్టారు. ఆ దెబ్బ‌ల‌కు వికాష్ స్పృహ త‌ప్పి కోమాలోకి పోయాడు. కోమాలో ప‌డిన వికాష్ ను ఆస్ప‌త్రిలో చేర్పించి, గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కొట్టార‌ని చెప్పి.. అక్క‌డి నుంచి జారుకున్నారు.

   

  అయితే చికిత్స పొందుతూ వికాష్ మృతి చెందాడు. డాక్ట‌ర్లు ఇచ్చిన స‌మాచారం మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. విచార‌ణ ప్రారంభించారు. అయితే ఇదంతా చేసింది ప్ర‌తిభ అని గుర్తించి, ఆమెతో పాటు స‌హ‌క‌రించిన ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. మ‌రో నిందితుడు ప‌రారీలో ఉన్నాడు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.