అడుగో , ఎస్సై పారిపోతున్నాడు.. పట్టుకోండి..

  0
  9619

  ఒక ఎస్సై వీధిలో పరుగుతీస్తున్నాడు.. చూసేవాళ్ళు ఎస్సై దొంగనో , హంతకుణ్ణో పట్టుకునేందుకు పరుగెత్తుతున్నాడని అనుకోవాల్సిందే.. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఎస్సై లంచం తీసుకుంటూ , ఎసిబి అధికారులు వచ్చేప్పటికి , వారికి చిక్కకుండా , వీధిలో పరిగెత్తాడు .. ఆయనతో పటు కానిస్టేబుల్ కూడా పరుగులు తీసాడు.. వాళ్ళ వెనుకే ఎసిబి అధికారులు కూడా పట్టుకోండి , పట్టుకోండి ..అంటూ పరుగుతీశారు.. వాళ్ళతో గ్రామస్తులు కూడా పరుగెత్తి చివరకు ఎస్సైని, కానిస్టేబుల్ పట్టుకున్నారు.. ఎస్సై ని , కానిస్టేబుల్ ని కోర్టు 14 రోజుల రిమాండ్ కి పంపింది.

   

  కర్ణాటకలో , తుంకూరు జిల్లా , గుబ్బిన్ తాలూకా , చంద్రశేఖరపుర పోలీస్ స్టేషన్లో జరిగిందీ ఘటన.. చంద్రన్న అనే వ్యక్తి కుటుంబ తగాదాలో ఎసై సోమశేఖర్ , కారు సీజ్ చేసాడు. కారుని వదిలిపెట్టాలంటే 26 వేలు లంచం అడిగాడు. చంద్రన్న అడ్వాన్స్ గ 12 వేలు ఇచ్చాడు. మిగిలిన మొత్తం ఇచ్చేప్పుడు ఏసీబీకి చెప్పాడు. దీంతో ఎసిబి ట్రాప్ వేసింది. లంచం డబ్బులు కానిస్టేబుల్ కి ఇవ్వాలని ఎస్సై చెప్పాడు.. కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటూ చిక్కిపోయాడు.. ఎస్సై తీసుకోమంటే తీసుకున్నానని చెప్పాడు.. దీంతో ఎసిబి అధికారులు , స్టేషన్లకు రాగా , ఎస్సై వాళ్ళను చూసి , పరుగు అందుకున్నాడు.. ఆ వెంటనే లంచం తీసుకున్న కానిస్టేబుల్ కూడా పరుగు తీసాడు.. వాళ్ళ వెనుక ఎసిబి అధికారులు , ఇదేంటో తెలియక గ్రామస్తులు.. ఇలా సినిమా సీన్ కన్నా బాగా రక్తికట్టింది లంచం వ్యవహారం..

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..