జిమ్ లో ఎవరైనా ట్రెడ్ మిల్ పై ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ సోనూ సూద్ మాత్రం ఇలా రిలాక్స్ అవుతున్నారు. అదేంటని మీకు డౌటెస్తే.. దానికి కూడా ఆయనే ముందుగా జవాబు చెప్పేస్తున్నాడు. ఇది రిలాక్సింగ్ మూడ్ అంటున్నాడు. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటాడు సోనూ సూద్. లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలకు అండగా నిలిచి దేవుడయ్యాడు. ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు సోనూ సూద్. ఇన్నాళ్లూ తన సేవా కార్యక్రమాల ఫొటోలు అప్ లోడ్ చేసే సోనూ సూద్ చాలా కాలం తర్వాత తన పర్సనల్ ఫొటో షేర్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోనూ ఫొటో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sometimes you need to relax.
Have a good day. pic.twitter.com/0zkBoHt4WZ— sonu sood (@SonuSood) March 31, 2021