రాఘవేంద్రరావుని ఆటాడేసుకుంటున్నారు..

    0
    738

    దర్శకుడు రాఘవేంద్రరావుని నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన తాజాగా ‘మా’ ఎన్నికలపై స్పందించారు. ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటే బాగుండేదని అన్నారు. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో కనీసం నోరు తెరవని ఇలాంటి పెద్దలంతా ఇప్పుడు తీరిగ్గా బయటకొచ్చి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యుంటే బాగుండేదని అనడంతో నెటిజన్లకు మండిపోయింది. ‘మా’ లో అంత యుద్ధం జరుగుతందని తెలిసినప్పుడు వీళ్లంతా ఎక్కడికెళ్లిపోయారని, కనీసం అప్పుడు చర్చలు జరిపి ఏకగ్రీవం కోసం ప్రయత్నించి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. తీరా అంతా అయిపోయిన తర్వాత చిరంజీవి, రాఘవేంద్రరావు లాంటి పెద్దలు బయటకొచ్చి ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. ఎన్నికలప్పుడు చిరంజీవి నోరు తెరవలేదని, ఎన్నికల రోజు అది కూడా వేరే సినిమా ఫంక్షన్లో ‘మా’ రాజకీయాల గురించి మాట్లాడారని విమర్శిస్తున్నారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..