బ్రునై సుల్తాన్ కూతురు పెళ్ళికి 14 వందల కోట్లు వ్యయం..

  0
  166

  ప్రపంచంలో అతి పెద్ద కోటీశ్వరుల్లో ఒకడైన బ్రూనే సుల్తాన్ కూతురు యువరాణి ఫర్జిల్లా పెళ్లికి ఖర్చు ఎంతయిందో తెలుసా..? అంతర్జాతీయ అధ్యయన సంస్థలు, ఆ పెళ్లికి ఏర్పాటు చేసిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీల అంచనా ప్రకారం ఈ పెళ్లికి 1400 కోట్ల రూపాయలు వ్యయం అయింది. బ్రూనే సుల్తాన్ బొల్కియా.. రెండో భార్య మూడో కూతురైన ఫర్జిల్లా పెళ్లి విశాలమైన బ్రూనే సుల్తాన్ రాజభవనంలో జరిగింది

   

  1700 గదుల్లో 5 వేల మంది ఒకేసారి సమావేశమయ్యే ఈ బ్రూనే సుల్తాన్ ప్యాలెస్ లో జరిగిన ఈ పెళ్లికి ప్రపంచంలోని కోటీశ్వరులు, దేశాధినేతలు చాలామంది హాజరయ్యారు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న ఇరాక్ కి చెందిన అమాంగ్ అబ్దుల్లా నబి అనే యవకుడిని 36 ఏళ్ల ఫర్జిల్లా వివాహమాడింది. ఆమె పెళ్లి డ్రెస్ కు వాడిన వజ్రాలు, కెంపులు, మరకత మాణిక్యాల విలువ 570 కోట్ల రూపాయలు. మిగతా 900 కోట్లు కేవలం పెళ్లి ఏర్పాట్లకు, అతిథులకు, వారికిచ్చే ఆతిథ్యానికి ఖర్చయ్యాయి.

   

  మరో 800 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు, పెళ్లి కూతురు తల్లికి, అల్లుడికి, అల్లుడు తల్లిదండ్రులకి బహుమతులుగా ఇచ్చారు. పెళ్లి కూతురు ఫర్జిల్లా తల్లికి 2003లోనే బ్రూనే సుల్తాన్ విడాకులిచ్చారు. అయినా ఆమె సంతానాన్ని ఆయనే పోషిస్తుంటాడు.

  .ప్రపంచంలో కోహినూర్ వజ్రం తర్వాత అంత విలువైన వజ్రాన్ని పెళ్లి కూతురు కిరీటంలో అమర్చారు. పెళ్లి కూతురు చెప్పుల్లో వాడిన వజ్రాల విలవ 92కోట్లు.దీన్నిబట్టి ఈ పెళ్లి ఎంత అట్టహాసంగా జరిగిందో , ఎంత ఖర్చు చేశారో అంచనా వేసుకోవచ్చు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..