షబ్నమ్ 12 ఏళ్ళ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా..?

  0
  1554

  ప్రియుడితో పెళ్లి నిరాకరించారని ఏడుగురు కుటుంబ సభ్యులను చంపిన కేసులో ఉరి కంబానికి ఎక్కనున్న షబ్నమ్ కొడుక్కి ఇప్పుడు 12 ఏళ్ళు. తన తల్లికి క్షమాబిక్షపెట్టాలని కొడుకు తాజ్ రాష్ట్రపతికి విజ్ఞప్తిచేశాడు. షబ్నమ్ తన కుటుంబ సభ్యులను చంపే నాటికే ఆమె రెండు నెలల గర్భవతి .

   

  పెళ్లికాకుండానే , జైల్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆరేళ్ళు వరకు బిడ్డ జైల్లోనే తల్లితో ఉన్నాడు. ఆరేళ్ళ వయసు తరువాత బిడ్డను తల్లితో జైల్లో ఉంచేందుకు నిబంధనలు ఒప్పుకోవు. అందుకే బిడ్డ దత్తత కోసం ప్రకటన ఇచ్చారు. అయితే కాలేజీలో షబ్నమ్ కు రెండేళ్లు జూనియర్ అయిన షఫీ , షబ్నమ్ కొడుకును తాను పెంచుకుంటానని ముందుకొచ్చాడు. పేదవాడిని , అయినా తనకు కాలేజీలో ఫీజ్ కట్టేందుకు షబ్నమ్ సహాయం చేసేదని , పెద్దక్కలా తనను ఆదుకుందని , దానికి కృతజ్ఞతగానే తాజ్ ను దత్తత తీసుకున్నానని చెప్పాడు.

  అప్పుడప్పుడు తాజ్ ని తీసుకొని , షఫీ జైల్లో షబ్నమ్ ని కలుస్తుంటాడు. కొడుకుని కావలించుకొని , బుద్దిగా చదువుకోమని చెపుతుందని అన్నాడు. తన కొడుకుని ఎప్పుడూ , తమ గ్రామానికి తీసుకుపోవద్దని మాత్రం కోరిందని చెప్పాడు..

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?