ఆస్కార్ విజేత నటుడు నికోలస్ కేజ్ ఐదో పెళ్లి

  0
  268

  ఆస్కార్ అవార్డ్ విజేత ,ప్రముఖ హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ ఐదో పెళ్లి శుక్రవారం జరిగిపోయింది. అతడి వయసు 57, అమ్మాయి వయసు 26.. జపాన్ కు చెందిన రికోశిబాతే , నికోలాస్ ఏడాది నుంచే ప్రేమలో పడ్డారు. పెళ్ళికి నికోలస్ మూడో భార్య , కొడుకు వచ్చారు. నాలుగో పెళ్లి చేసుకున్న నికోలస్ పెళ్ళైన నాలుగో రోజే ,భార్యకు విడాకులిచ్చేశాడు. ఐదో పెళ్ళికి ముచ్చటగా తన పిల్లలను పిలిచాడు.

  అందులో పెద్దకొడుకుకంటే , పెళ్లికూతురు ఆరేళ్ళ చిన్నది. ఐదో భార్య ఎంతకాలం ఉంటుందో చూడాలని నెటిజెన్లు జోకులు రూపంలో ఆశీస్సులు అందిస్తున్నారు. అయితే ఐదో పెళ్ళాం రికోశిబాతేతో తన ప్రేమ చాలా గట్టిదని , తమది గత జన్మల సంబంధమని , అందుకే అనుకోకుండా కలిశామని నికోలస్ చెబుతున్నాడు. పెళ్ళికి వయసు అడ్డుకాబోదని , తమ మనసులు కలిశాయని నికోలస్ చెప్పాడు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/PRKrFZsCwYE