అతడు నేరం చేసేది ఎందుకో తెలిస్తే ..?

  0
  255

  జైలుకి పోవాల‌నే ఉద్దేశ్యంతోనే ఒక యువ‌కుడు రెండు నేరాలు చేశాడు. మొద‌టి నేరం ఓ రెస్టారెంట్ ఓన‌ర్ ను కొట్ట‌డం.రెండో నేరం పోలీస్ క‌మిష‌న‌ర్ ఆఫీసులో ప్లాస్టిక్ కుర్చీ దొంగ‌త‌నం చేయ‌డం. విన‌డానికి వింత‌గానే ఉన్నా బెంగుళూరులో జ‌పాన్ కి చెందిన ఓ యువ‌కుడు ఈ రెండు నేరాలు చేసి జైలుకి వెళ్ళాడు. మొద‌టి నేరంపై జైలుకి వెళ్ళి బ‌య‌ట‌కి వ‌స్తూనే, మ‌ళ్ళీ రెండో నేరం చేసి జైలుకి వెళ్ళాడు. తిరుటోషి త‌నాకా అనే 31ఏళ్ళ యువ‌కుడు ఇంగ్లీష్ కోచింగ్ కోసం జ‌పాన్ నుంచి బెంగుళూరు వ‌చ్చాడు. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు అయిపోవ‌డంతో ఓ రెస్టారెంట్ లో ప‌నికి చేరాడు. ఆ రెస్టారెంట్ ఓన‌ర్ జీతం ఇవ్వ‌క‌పోవ‌డంతో అత‌నిపై దౌర్జ‌న్యం చేసి జైలుకి వెళ్ళాడు. ఆ త‌ర్వాత జైలు నుంచి విడుద‌లై వ‌చ్చి, త‌న‌ను అక్ర‌మంగా జైలులో పెట్టారంటూ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కి ఫిర్యాదు చేశాడు. త‌న‌కు బెయిల్ వ‌చ్చిన త‌ర్వాత కూడా పోలీసు అధికారులు లంచం అడిగార‌ని ఆరోపిస్తూ వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేశాడు.

  ఈ రెండు కేసులు విచార‌ణ‌లో ఉన్నాయి. ఈలోగా ఫిబ్ర‌వ‌రి 27న త‌నాకా వీసా గ‌డువు పూర్తి కావ‌చ్చింది. దీంతో పోలీస్ క‌మిష‌న‌ర్ ఆఫీసులో ప్లాస్టిక్ కుర్చీ దొంగ‌త‌నం చేసి, త‌న‌పై కేసు పెట్టి జైలులో పెట్ట‌మ‌న్నాడు. జైలుకి పోతే వీసా గ‌డువుతో సంబంధం లేకుండా బెంగుళూరులోనే ఉండిపోవ‌చ్చ‌న్న‌ది అత‌ని ఆలోచ‌న‌. తాను ఉద్దేశ్య పూర్వ‌కంగానే కుర్చీ దొంగ‌త‌నం చేశాన‌ని అన్నాడు. తాను జైలుకి వెళితే వీసా గడువు పూర్త‌యినా, జైలు నుంచి వ‌చ్చి పోలీసు అధికారుల మీద‌, రెస్టారెంట్ ఓన‌ర్ మీద పెట్టిన కేసు పూర్తి చేసుకోగ‌ల‌న‌ని చెప్పాడు. లేదంటే తాను జ‌పాన్ కి వెళ్ళి పోవాల్సి వస్తుంద‌ని అంటున్నాడు. ఏదో ఒక నేరం చేసైనా బెంగుళూరులోనే ఉండి, త‌న‌ను లంచం అడిగిన పోలీసు మీద‌, రెస్టారెంట్ ఓన‌ర్ మీద చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు తాను బెంగుళూరులోనే ఉండిపోతాన‌ని చెబుతున్నాడు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/PRKrFZsCwYE