ఓ తల్లి ఐస్ క్రీమ్ లో ఎలుకల మందు కలిపి హాల్ లో ఉంచి తను బెడ్ రూమ్ లోకి పోయి పడుకుంది…

  0
  908

  కేరళలో ఓ తల్లి చేసిన దారుణం ఇప్పుడు సంచలనం రేకెత్తించింది. వర్ష అనే 25ఏళ్ల వివాహిత ఐస్ క్రీమ్ లో ఎలుకల మందు కలిపి హాల్ లో ఉంచి తను బెడ్ రూమ్ లోకి పోయి పడుకుంది. ఈ ఐస్ క్రీమ్ ను ఆమె ఐదేళ్ల కొడుకు, 19ఏళ్ల చెల్లెలు తిన్నారు.

  మరుసటి రోజు కొడుక్కి వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలుడు చనిపోయాడు. ఆ తర్వాత, ఆమె చెల్లెలికి కూడా ఇదే రకంగా వాంతులు విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రక్తపరీక్షల్లో ఆమెకు విషం ఇచ్చారని తేలింది. ఆ తర్వాత బాలుడి శవానికి కూడా పరీక్షలు చేయడంతో ఆ అబ్బాయి కూడా విష ప్రయోగం వల్లే చనిపోయాడని తెలిసింది.

  వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు చావులపై అనుమానంతో పోలీసులు వర్షని ప్రశ్నించారు. తాను ఆత్మహత్య చేసుకోవాలని, ఐస్ క్రీమ్ లో ఎలుకలమందు కలిపి తిన్నానని ఆ తర్వాత మిగిలింది హాల్ లోనే వదిలేసి బెడ్ రూమ్ లో పడుకున్నానని వర్ష చెప్పింది. అయితే ఆమె మాటలు పోలీసులు విశ్వసించలేదు.

  తన కొడుకుని, చెల్లెల్ని ఆమె ఉద్దేశపూర్వకంగానే ఐస్ క్రీమ్ లో విషం పెట్టి చంపిందని చెబుతున్నారు. తను కొద్ది మోతాదులోనే ఐస్ క్రీమ్ తిని నాటకం ఆడుతోందని, వర్ష భర్త తరపు బంధువులు కూడా అనుమానిస్తున్నారు. తమ తల్లి ఇంటికి వచ్చిన తర్వాతే ఆమె ఈ దారుణానికి వడిగట్టింది. వర్షపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..