నేను తల్లిని కాబోతున్నా…

    0
    870

    ప్రభాస్ సరసన సూపర్ హిట్ సినిమా మిర్చిలో నటించిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న టైమ్ లో సడన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అంతే కాదు, ఇంకెప్పుడు సినిమాల్లోకి రానంటూ విదేశాల్లో చదువుకోడానికి వెళ్లింది..

    తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు తల్లి కాబోతోంది. దీనికి సంబంధించి బేబీ బంప్ ను చూపిస్తూ ఓ ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. జో నేను, చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం, ఈ జూన్ లోనే బేజీ లాంగెల్లా కొత్త ప్రపంచంలోకి వస్తుంది అని ట్వీట్ చేసింది రిచా.

    https://twitter.com/richyricha/status/1365879283013492740?s=20

    2007లో మిస్ ఇండియా యూఎస్‌ఏ టైటిల్ గెలుచుకున్న రిచా.. 2010లో ‘లీడర్’ సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించారు. ఈ సినిమాలో రిచా.. రానా దగ్గబాటికి జోడీగా నటించారు. ఆ తర్వాత ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’ సినిమాల్లో నటించారు. చివరిగా రిచా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమాలో నటించారు.

    ఆ తర్వాత సినిమాలు మానేసి తన స్వస్థలమైన అమెరికా వెళ్లిపోయారు. సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సినవి చాలా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..