జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు పచ్చ జెండా

  0
  711

  జడ్పీటీసీ, ఎంపీటీసీ, మ‌రియు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు పచ్చ జెండా ఊపారు. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం అంగీక‌రించ‌డంతో త్వ‌ర‌లో ఎన్నిక‌ల షెడ్యూల్ రూపొందించే అవ‌కాశ‌ముంది. అయితే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌… గ‌తంలో ఆగిన చోట నుంచే మొద‌ల‌వుతుందా లేక కొత్త‌గా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేస్తారా అన్న‌ది తేలాల్సి వుంది.

  గ‌తంలో నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్ర‌కారం, చాలాచోట్ల జ‌డ్పీటీసీ, ఎంపీటీసీల‌కు ఏక‌గ్రీవాలు జ‌రిగాయి. ఈ ఏక‌గ్రీవ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు కోరుతున్నాయి. అయితే ఏక‌గ్రీవాల‌ను ఇప్పుడు ర‌ద్దు చేస్తే ఏక‌గ్రీవంగా ఎన్నికైన వారు మ‌ళ్ళీ కోర్టుకు వెళ్ళే అవ‌కాశ‌ముంది. దీంతో ఎన్నిక‌లు వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంది.

   

  https://www.indiatvnews.com/elections/news-andhra-pradesh-ap-panchayat-election-phase-1-2021-result-local-body-updates-ysr-congress-tdp-bjp-683975

  ఎన్నిక‌ల సంఘం ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో మ‌రో వారం రోజుల్లో తేలిపోనుంది. గ‌తంలో సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో ప‌రిష్కార‌మైన కేసుల దృష్ట్యా ప‌రిశీలిస్తే, ఒక్క‌సారి ఏక‌గ్రీవంగా ఎన్నిక జ‌రిగితే దాన్ని ర‌ద్దు చేసే హ‌క్కు ఎన్నిక‌ల సంఘానికి ఉండ‌దు. గ‌త తీర్పుల‌ను దృష్టిలో పెట్టుకుంటే ఏక‌గ్రీవాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి, గ‌తంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఆగిన చోట నుంచే ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. అయితే ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తుందో చూడాలి.

   

  https://ndnnews.in/11yearoldboyblackmailsfather/