మిస్ ఇండియా మన తెలుగమ్మాయే..

  0
  707

  ‘మిస్‌ ఇండియా 2020’ టైటిల్‌ గెలుచుకుని తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది మానస వారణాసి. తెలంగాణకు చెందిన 23 ఏళ్ల యువ ఇంజనీర్‌ మానస హైదరాబాద్ నివాశి. వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటాన్ని కైవసం చేసుకుంది.

  గ్లోబల్ ఇండియన్ స్కూల్ లో చదువుకున్న మానస, వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. 2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొంటుంది.

  బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచింది మానస. హర్యాణాకు చెందిన మానిక శికంద్‌ ఫెమినా మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్‌ ఫెమినా మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్‌ వ్యవహరించారు.

  https://www.instagram.com/missindiaorg/?utm_source=ig_embed

  మానస ఆరోగ్య రహస్యం ఇదే..

  ఆరోగ్యం, ఫిటెనెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపించే మానస.. ఉదయాన్నే గోరువెచ్చటి నీరు తాగడం తనకు అలవాటు అని చెబుతోంది. గోరువెచ్చని నీరు తాగితే.. ఆరోగ్యం బాగుంటుందని చెబుతోంది మానస. 21 సంవత్సరాల వయసు నుంచి మోడలింగ్‌ రంగంపై మానస దృష్టిపెట్టింది.

  ప్రియాంక చోప్రా నా ఫేవరెట్..

  గ్లామర్ వరల్డ్ లో తనకు ప్రియాంక చోప్రా అంటే బాగా ఇష్టమను చెబుతోంది మానస. సంగీతం, సినిమాలు, వ్యాపార రంగం, సామాజిక సేవ.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రియాంక నెంబర్-1 అని, అందుకే ఆమె తనకు ఇష్టమని చెబుతోంది మానస.

  ఎప్పుడైనా ఒత్తిడి ఎదురైతే మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతానని చెబుతోంది మానస. జీవితంలోని ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని సెలవిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

   

  ఇవి కూడా చదవండి: 

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?