నొప్పి భరించలేక దాన్ని కోసేసుకున్నాడు..

  0
  426

  మూత్ర సంబంధిత స‌మ‌స్య‌తో బాధ ప‌డుతోన్న ఓ వృద్దుడు.. ఆ బాధ భ‌రించ‌లేక‌, దారుణ‌మైన నిర్ణ‌యం తీసుకున్నాడు. ఏకంగా త‌న మ‌ర్మాంగాన్నే కోసేసుకున్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 75 ఏళ్ళ ఓ వృద్దుడు చాలాకాలంగా మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. చాలామంది స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ళాడు. అయినా స‌మ‌స్య మాత్రం ప‌రిష్కారం కాలేదు. ఈ వ్యాధి న‌యం చేసుకోవ‌డానికి వేల‌కు వేలు ఖ‌ర్చు చేశాడు. అయినా ఫ‌లితం మాత్రం శూన్యం.

   

  దీనికి తోడు బాధ రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఈ న‌ర‌కాన్ని త‌ట్టుకోలేక క‌త్తితో త‌న మ‌ర్మాంగాన్ని కోసేసుకున్నాడు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో, వెంట‌నే కుటుంబీకులు అత‌నిని చికిత్స కోసం ఆస్ప‌త్రికి తీసుకెళ్ళారు. ప్ర‌స్తుతం ద‌మోహా జిల్లా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడా వృద్దుడు. ఎందుకిలా చేశావ‌ని అడిగితే.. ఈ బాధ‌ను త‌ట్టుకోలేక పోయాన‌ని అందుకే ఇలా చేశాన‌ని, తాను చేసిన ప‌నికి తాను బాధ ప‌డ‌డం లేద‌ని స‌మ‌ర్ధించుకోవ‌డం కొస‌మెరుపు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.