చిరపుంజి అరుదైన గుర్తింపు ఇక మాయం..

    0
    585

    ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఏది అనేది అప్పట్లో ఓ ఇంపార్టెంట్ జీకే బిట్. చిరపుంజిని తోసిరాజని మాసిన్రామ్ అనే ప్రాంతం అత్యథిక వర్షపాతంలో రికార్డు సృష్టించేది. ఇప్పుడా రికార్డులన్నీ గల్లంతయ్యాయని తెలుస్తోంది. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలో మార్పులే ఈ ప్రాంతంలోని వర్షపాతంపై భారీ ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు గుర్తించారు. మేఘాలయ తన జీవాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోతోందని హెచ్చరిస్తున్నారు.

    ఎప్పుడూ వర్షంతో తడుస్తూ ఉండే చిరపుంజి గ్రామానికి ప్రపంచంలోనే అత్యంత తేమతో ఉండే గ్రామంగా పేరుంది. ఇక్కడ సంవత్సరంలో 10,000 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురుస్తుంది. గత వందేళ్లలో ఇక్కడి వర్షపాత తీరును పరిశీలించిన పరిశోధకులు, ఇక్కడ రానురాను వర్షపాతం తగ్గుతుందని గుర్తించారు. వందేళ్లుగా వర్షపాతాన్ని స్టడీ చేస్తున్న వీరు.. శాటిలైట్ సాయంతో డేటా విశ్లేషించి ఈ మార్పుని గమనించారు. గత 20ఏళ్లుగా ఈశాన్య భారతదేశంలో వృక్షసంపదలో భారీ తగ్గింపు ఉందని, దీనివల్ల వర్షపాతంలోనే కాక మానవ జీవితంపై కూడా ప్రభావం ఉంటోందని తేల్చారు.

    అయితే ఈశాన్య ప్రాంతం ఎక్కువగా కొండ, పెద్ద పెద్ద మైదానాల విస్తరణలతో కూడి ఉన్నందున ఈ ప్రాంతం ప్రాంతీయ, ప్రపంచ వాతావరణంలో మార్పులకు అత్యంత సున్నితమైనదని అధ్యయన బృందం చెబుతోంది. ఈ బృందం ప్రస్తుతం భారతదేశం అంతటా వర్షపాతం యొక్క మార్పులను పరిశీలిస్తోంది.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..