నెలలో వారమే మా కాపురం.. తరువాత ఎవరికివారే …

    0
    1765

    హీరోయిన్ ప్రియాంకచోప్రా , తనకంటే వయసులో పదేళ్లు చిన్న అయిన సింగర్‌ నిక్‌ జోనస్‌ను 2018లో ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె వయసు 36, నిక్ వయసు 26.. పెళ్ళైన వీరిద్దరూ నెలలో ఒక వారమే కలిసి కాపురంచేస్తారు.

    మూడువారాలు ఆమె అటు , అతడు ఇటు..

    ఇది నమ్మలేని నిజం . మిగిలిన సమయంలో ఎవరికివారే యమునాతీరే. మూడువారాలు ఆమె అటు , అతడు ఇటు.. ఎవరిపనులు వారివే. పెళ్ళికి ముందే ఈ జంట ఒక ఒప్పందం చేసుకుందట . నెలలో చివరివారంలో ఇద్దరూ కలుసుకోవాలని పెళ్లికి ముందే షరతులు విదించుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పారు. ‘

    నెలలోని చివరి వారంలో కలుసుకోవాలని…

    ఇద్దరం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెలలోని చివరి వారంలో కలుసుకోవాలని షరతు పెట్టుకున్నాం. వృత్తి రీత్యా ఇద్దరం షూటింగ్ ల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుంటాం. అందుకే పెళ్లి సమయంలో ఈ నియమం పెట్టుకున్నాం. లేదంటే ఒకరికొకరం సమయం కేటాయించుకోవాలనే ధ్యాసే ఉండకపోవచ్చు కదా’ అంటూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయారు.

    https://www.instagram.com/priyankachopra/

    విభిన్న సంస్కృతుల్లో పెళ్ళి…

    గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. వీరిద్దరి పెళ్లి 2018లో జోధ్ పూర్ లోని ప్రఖ్యాత ఉమైద్ రాజభవనంలో జరిగింది. ఇద్దరు భిన్న మతాలకు చెందిన వారు కావడంతో , విభిన్న సంస్కృతుల్లో పెళ్ళిజరిగిన విషయం తెలిసిందే..

     

    ఇదికూడా చదవండి..

    https://ndnnews.in/highcourtonillegalcontacts/