ఆడ, మగ గదిలోఉంటే అక్రమసంబంధమేనా ..? హైకోర్టు ఆగ్రహం.

  0
  617

  ఆడ , మగ ఇంట్లో తలుపులేసుకొని ఉంటే , వారిద్దరి మధ్య అక్రమసంబంధం ఉన్నట్టు చెప్పడం ధర్మం కాదని చెన్నై హైకోర్టు తీర్పుచెప్పింది. వారిద్దరూ కలిసి గదిలో ఉన్నంతమాత్రాన వారు తప్పుచేశారని రుజువెక్కడ ఉందని నిలదీసింది.

  మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని…

   

  శరవణ బాబు అనే పోలీసు కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. 23 ఏళ్ళక్రితం శరవణ బాబు తన క్వార్టర్‌లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని.. అందుకే తలుపులు వేసుకుని ఇద్దరు లోపల ఉన్నారని ఆరోపించారు. ఇక ఇలాంటి చర్యలకు పాల్పడినందకు గాను అతడిని విధుల నుంచి తొలగించారు. దాంతో శరవణ బాబు కోర్టును ఆశ్రయించాడు.

  గదిలో ఏమి జరిగిందో మీకు తెలుసా.. ?

   

  ఈ కేసు విచారించిన జస్టిస్‌ ఆర్‌ సురేష్‌ కుమార్‌ తన తీర్పులో ఇద్దరూ గదిలో ఉంటే లోపల ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ‘‘సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం.. విధుల నుంచి తొలగించడం సరైనది కాదు. ఇక ఈ కేసులో నిందితుడు శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఉన్నాడు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని’’ వెల్లడించింది. అంతేకాక నిందితుడి వాదనతో ఏకీభవించిన హై కోర్టు ఇద్దరు కానిస్టేబుల్స్‌ని అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని.. మరే ఇతర ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది.

  ఆడ, మగ గదిలోఉంటే అక్రమసంబంధమేనా ..? హైకోర్టు ఆగ్రహం.

   

  అతడికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలని , గత 23 ఏళ్ళ జీతం బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. శరవణ బాబుమాట్లాడుతూ మహిళా కానిస్టేబుల్‌ నివాసం.. నా క్వార్టర్స్‌ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇక ఆమె ఇంటి తాళం కోసం నా నివాసానికి వచ్చింది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా.. ఎవరో తలుపు లాక్‌ చేశారు. ఆ తర్వాత మేం డోర్లు వేసుకుని ఇంట్లో ఏదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు భావించిన ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారు’’ అని తెలిపాడు.

   

  https://ndnnews.in/valentinesdaycheating947-2/