చిరంజీవి ఫ్యామిలీనుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కి తమ్ముడు వైష్ణవ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కింది. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా విడుదల చాలా రోజులు వాయిదా పడింది. చివరికి ఇప్పుడు ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను ఎన్టీఆర్ విడుదల చేశారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్ అంటూ వైష్ణవ్ భుజం తట్టాడు తారక్.
https://www.youtube.com/watch?v=fB3RcpbLvco&feature=emb_logo
చిరంజీవి వల్లే ఉప్పెన థియేటర్లలోకి..
లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు చాన్నాళ్లపాటు తెరవకపోవడంతో ఓ దశలో ఉప్పెన సినిమాను ఓటీటీకి ఇచ్చేద్దామనుకున్నారు. అయితే చిరంజీవి అడ్డుపడ్డారట. హీరోగా తన మేనల్లుడి తొలి సినిమా సిల్వర్ స్క్రీన్ పైనే పడాలని అన్నారట. అందుకే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది.
https://www.youtube.com/watch?v=mrqgz4_a4PU
‘నీ కళ్లు నీలి సముద్రం’ అంటూ ఓ సూపర్ హిట్ సాంగ్ తో ఉప్పెన ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్ తో ఈ సినిమా తెరకెక్కింది. వైష్ణవ్‌తేజ్‌సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
https://www.youtube.com/watch?v=xzunlLhgcfs