తొలిప్రేమ సినిమా హల్లో భీభత్సం వెనుక నిజమేది ?

  0
  211

  విజయవాడ కపర్థి సినిమా ధియేటర్ లో తొలిప్రేమ సినిమా ప్రదర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సృష్టించిన భీభత్సం వెనుక రాజకీయ కుట్ర ఉందా ..? ఇది నిజంగానే అభిమానులు చేశారా ..? లేక అభిమానుల ముసుగులో సంఘవిద్రోహశక్తులు చేశాయా..? ఈ అనుమానాలు ఎందుకంటే , ఇది ఇప్పటివరకు ఫ్యాన్స్ ఇలాంటి భీభత్సం చేయలేదు. అదీకాకుండా , ఇది కొత్త సినిమాకూడా కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఈ సినిమా చేసారు. సెకండ్ షో సమయంలో అభిమానుల పేరుతో బీభత్సం జరిగింది.

  మద్యం మత్తులో దాదాపు పదిమంది యువకులు , పైకెక్కి సినిమా తెర చించేసి, సీట్లు ధ్వంసం చేశారు. ధియేటర్ ధ్వంసానికి ముందుగానే కుట్ర తోనే వచ్చారంటున్న సినిమా హాల్ సిబ్బంది. సినిమా మధ్య లో పది మంది అకస్మాత్తుగా లేచి గొడవ చేశారు.  స్క్రీన్ పైకి ఎక్కి కోసేశారు.. సీట్ల పైకి ఎక్కి పీకేశారు. అడ్డు వచ్చిన సిబ్బంది పై దాడి చేసి కొట్టారు. సిసి కెమెరా లు, బయట అద్దాలు కూడా ధ్వంసం చేశారు.

  పవన్ కళ్యాణ్ అభిమానులు పేరుతో కావాలనే చేశారన్న వాదన వినిపిస్తోంది. సినిమా ప్రదర్శనలో కూడా ఎటువంటి అంతరాయాలు కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంతటి భీభత్సం ఎలా జరిగిందన్నదే ఇప్పుడు అనుమానం.. హాల్లో జరిగిన భారీ స్థాయి భీభత్సం , సినిమాకు వచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేసేట్టు జరిగిన దౌర్జన్యం కూడా ఎక్కువగానే ఉంది.. అందువల్లనే అనుమానాలు మొలకెత్తుతున్నాయి.. ఏదిఏమైనా విచారణలో నిజం తేలాల్సివుంది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here