ధనుష్కోటి బీచ్ లో మునక మృత్యువుతో పరిహాసమే.

  0
  209

  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర తీరాలలో తమినాడులోని ధనుష్కోటి సముద్రతీరం ఒకటి. ధనుష్కోటి తీరంలో స్నానం అంటేనే మృత్యువుతో జలకాలాడటం. మృత్యోవుతో సరసాలు ఆడటం. అంతటి భయంకరమైన సముద్ర తీరం ధనుష్కోటి తీరం . తమిళనాడు శ్రీలంకలోని జాఫ్న మధ్య ఉన్న ఈ ధనుష్కోటి తీరంలో సముద్రంలో అంతర్గతంగా ప్రవాహం అధికంగా ఉంటుంది. అంటే సముద్రం ఉపరితలం కింద అండర్ కరెంట్ ఎక్కువ అన్నమాట. దీనికి కారణం పాక్ జలసంధి, మున్నార్ గల్ఫ్ దీవుల ప్రవాహ కలయిక ఇక్కడే జరుగుతుంది , దీనికి తోడు అక్కడ నుంచి వచ్చే బలమైన గాలుల ఉదృతికూడా ఒక కారణం. దీని కారణంగా ధనుష్కోటి తీరంలో అలల తాకిడికి నీటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

  ఒక్కోసారి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒడ్డునున్న పడవలను కూడా లోపలికి తీసుకెళ్లి పోయేంత భయంకరంగా ఇక్కడ సముద్ర ఘోష ఉంటుంది. అందువల్లనే ధనుష్కోటి సముద్ర తీరంలో బీచ్ లో స్నానాలు చేయవద్దని ఒక గట్టి హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ధనుష్కోటి తీరంలో పర్యాటకులు స్నానాలు చేస్తే సముద్రంలో కొట్టుకుపోయే సమయంలో అక్కడున్న రెస్క్యూటివ్ గానీ, అగ్నిమాపక సిబ్బంది గాని సాహసం చేసి సముద్రంలోకి పోలేరు .

  ఎందుకంటే సముద్ర జలాల్లో అలల తీవ్రత , అంతర్గతంగా సముద్రంలో ఉన్న పోటు ఎలాంటిదో వారికి తెలుసు. కేవలం స్థానిక మత్స్యకారులకు మాత్రమే ఆ సముద్ర అలలు ఆటు, పోటు తెలుసు. వారు మాత్రమే ధైర్యం చేసి సముద్రంలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టగలరు. అది కూడా ధనుష్కోటి పరిసర ప్రాంతాలలో ఉన్న మత్స్యకారుల ప్రత్యేకత. వాళ్ళు సాగర పుత్రులు, అందుకే మహోగ్ర ధనుష్కోటి సముద్ర ఉగ్ర రూపాన్ని ఆకలింపు చేసుకున్న వాళ్లు మాత్రమే..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here