ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సస్పెన్షన్..

    0
    754

    ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సస్పెన్షన్..

    రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న దశలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిందని, ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్టు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం సబబు కాదని, చర్చలు జరిగినప్పుడు ఎన్నికల నిర్వహణ కుదరదని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని అధికారుల బృందం స్పష్టం చేసిందని ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోకుండా ఎన్నికలో నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొంది.