ఒక్క వాటర్ బాటిల్ కోసం , హోటల్ వాళ్ళను నీళ్లు తాగించాడు.. శభాష్ పెద్దాయన ..

    0
    1427

    ఆయన కూడా అందరిలాంటి వాడైతే మనం పట్టించుకునేది లేదు.. కానీ ఒక వాటర్ బాటిల్ ధరపై న్యాయపోరాటం చేసి.. సాధించాడు. అతనిపేరు రోహిత్ పటేల్. 67 ఏళ్ళు.. అహ్మదాబాద్ లో స్నేహితులతో కలిసి ఒక హోటల్ కు వెళ్ళాడు. హోటల్ నిర్వాహకులు వాటర్ బాటిల్ కు 164 రూపాయల బిల్ వేశారు. దీంతో రోహిత్ కు చిర్రెత్తుకొచ్చింది. హోటల్ యాజమాన్యంతో చాలాసేపు వాదనకు దిగారు. అయినా హోటల్ నిర్వాహకులు బిల్ కట్టాల్సిందేనని వాదనకు దిగారు. అయితే రోహిత్ అప్పటికి బిల్ కట్టేశాడు. 20 రూపాయల వాటర్ బాటిల్ కు 164 రూపాయలకు అమ్మి దోపిడీ చేస్తున్నారన్న ఆక్రోశం, రోహిత్ లో పెరిగిపోయింది. వీరిని వదిలిపెట్టకూడదని కోర్టు కు ఈడ్చాడు. అయిదేళ్లపాటు నిరంతరం కోర్టులో పోరాటం చేశాడు. ఒక్క వాయిదా కూడా మిస్ కాకుండా… వృదాప్యంలోనూ న్యాయపోరాటం చేశాడు. అయిదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్ట్ వాటర్ బాటిల్ కు 164 రూపాయలు ఛార్జ్ చేయడం అన్యాయమని.. అందుకు పరిష్కారం క్రింద 5500 రోహిత్ కు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఒక బాధ్యతగల పౌరుడిగా తాను వాటర్ బాటిల్ ధరపై పోరాటం చేశానని.. కోట్లరూపాయల ఆదాయం కలిగిన హోటళ్లు ఇంతలా దిగజారి వందలరూపాయలు వసూలు చేయడం ఏమిటని రోహిత్ ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఇలాంటివి చూసికూడా మౌనంగా ఉంటే ప్రజలను యథేచ్ఛగా దోపిడీ చేస్తారని.. అందుకే తిరగబడి న్యాయపోరాటం చేయాలను రోహిత్ చెబుతున్నాడు.