అలాచేస్తేనే అత్యాచారంగా పరిగణించాలి.

    0
    1483

    12 ఏళ్ళ బాలికపై అత్యాచారం విషయంలో నాగ్ పూర్ హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు సంచలనమైంది. బాలిక పైన బట్టలు విప్పకుండా , చేతులను జాకెట్ గానీ , టాప్ కిందనుంచిగానీ ఛాతీ పైకి దూర్చకుండా , ఒకరకంగా స్కిన్ టు స్కిన్ టచ్ లేకుండా అమ్మాయి ఛాతినొక్కడం , లేదా ఛాతీభాగంలో వత్తిడి కలిగించడం అత్యాచార యత్నం కిందకు రాదని జస్టిస్ పుష్ప గనెడివాలా తీర్పు చెప్పారు. లైంగికపరమైన భావనలు, ఇతరత్రా దురుద్దేశాలు లేకుండా బాలిక ఛాతీ పై చేతులు పెట్టడం , కౌగిలించుకోవడం pocso చట్టం పరిధిలోకి రాదనీ అన్నారు. అత్యాచారాన్ని నిరూపించాలంటే అమ్మాయి టాప్ గానీ , జాకెట్ గానీ తొలగించి ఉండాలని , లేదా జాకెట్ లేదా బ్రా ,లేదా టాప్ కిందనుంచి చేతులు లోపలి పెట్టి ఉండాలని స్పష్టం చేసింది. ఇలా చేస్తేనే pocso చట్టం వర్తిస్తుందని పేర్కొనింది. అలాకాకుండా లైంగికపరమైన ఉద్దేశంతో అమ్మాయిని దగ్గరకు తీసుకోవడం , ఛాతీపై వత్తడం లేదా ఆమె మర్మాంగాలను తాకడం , తన మర్మాంగాలను తాకేట్టు వత్తిడిచేయడంలాంటి పనులు చేస్తే ఐపీసీ 354 సెక్షన్ కిందకు వస్తుందని , ఇలాంటి పనులు pocso చట్టంకిందకు రావని అన్నారు. ఒక వ్యక్తి 12 ఏళ్ళ అమ్మాయిని జామకాయ ఇస్తానని ఇంట్లోకి పిలిచి , ఆమె ఛాతీని నోక్కాడని , దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ వ్యక్తిపై pocso చట్టంకింద కేసునమోదుచేసి జైలుకు పంపారు . తనపై pocso చట్టం కింద కేసుపెట్టకూడదని ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబందించిన కేసులో నాగపూర్ బెంచ్ ఈ వివరణ ఇచ్చింది..